calender_icon.png 26 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

24-04-2025 01:17:02 AM

షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసిన ఇంటర్ బోర్డు తాజాగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 22  నుంచి 29 వరకు పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.

25వ తేదీన ఆదివారం రోజు కూడా విద్యార్థులకు పరీక్ష ఉంది. ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇదే టైం టేబుల్ వర్తించనుందని తెలిపింది. జూన్ 3 నుంచి 6 వరకు రెండు సెషన్స్‌లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 9న ఇంటర్ ఫస్టియర్, 10న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ జనరల్, ఒకేషనల్, ఇంప్రూవ్‌మెంట్ వేర్వేరుగా ఫీజులు రూ.520 నుంచి రూ.1450 వరకు ఖరారు చేశారు. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.