పెద్ద ఎత్తున పట్టుబడిన నగదు
కరీంనగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల సంద ర్భంగా పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టి సరైన ఆధారాలు లేని నగదు స్వాధీనం చేసుకుం టున్నారు. ఈ క్రమంలోనే శనివారం కరీంనగర్లో పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారు. వన్‌టౌన్ పరిధిలో రూ.71 వేలు, టూటౌన్ పరిధిలో రూ. 2.60 లక్షలు, గీతా భవన్ చౌరస్తాలో రూ.14.89 లక్షలు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా కరీంనగర్ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 88.49 లక్షలు పట్టుబడినట్లు ఏసీపీ గోపతి నరేందర్ తెలిపారు. స్వాధీనం చేసుకు న్న నగదును సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.