29-03-2025 12:08:29 AM
ఎస్‌ఎల్‌బీసీ వద్ద- రెస్క్యూ బృందాల నిపుణులతో సమీక్షలు
నాగర్‌కర్నూల్, మార్చి 28 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకు న్న మిగతా ఆరుగురి కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డేంజర్ జోన్ డీ డీh-2 వద్ద కార్మికుల ఆనవాళ్ల కోసం తవ్వకాలు జరుపగా ప్రస్తుతం ఎస్కవేటర్‌ల సాయంతో మట్టితీత పనులు వేగవంతం చేశారు. లోకో ట్రైన్ ప్రమాద స్థలి వరకు వెళ్లే విధంగా అడ్డుగా ఉన్న మట్టిని టీబీఎం యంత్ర విడిభాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటకి తరలించేందుకు మరిన్ని మోటార్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.