calender_icon.png 28 February, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో ముమ్మర దర్యాప్తు

27-02-2025 10:22:59 PM

ఎల్బీనగర్: సంచలనం సృష్టించిన శిశువులను విక్రయిస్తున్న ముఠా కేసును రాచకొండ పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. కేసులో కీలక నిందితురాలిని పట్టుకోవడానికి పోలీసులు వేట ప్రారంభించారు. ఇప్పటికే రాచకొండ పోలీస్ బృందాలు గుజరాత్‌కు వెళ్లాయి. నవజాత శిశువులను గుజరాత్‌ నుంచి తీసుకొచ్చి.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠా సభ్యులు ఇచ్చిన కీలక సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక నిందితురాలు వందన ముఠా కోసం గుజరాత్‌లో రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో మరో ముగ్గురినీ అరెస్టు చేశారు. వీరిలో ఉమారాణి, జయశ్రీ , సోనీ  కీర్తి ఉన్నారు. పిల్లలను కొనుగోలు చేసిన నలుగురు దంపతులను కూడా నిందితులుగా రాచకొండ పోలీసులు చేర్చారు.