calender_icon.png 22 October, 2024 | 11:38 PM

ముమ్మరంగా వరద సహాయక చర్యలు

02-09-2024 02:17:23 AM

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తు న్న వర్షాలతో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మల్లాపూర్, హెచ్‌బీకాలనీ, నాచారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్, ఈఈ హరిలాల్, సంబంధిత అధికారులతో కలిసి ఆదివారం ఆయన పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులపై వర్షపు నీరు నిలువకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. కార్పొరేటర్లు స్వర్ణరాజు, దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, శాంతి సాయిజెన్ శేఖర్, వివిధ విభాగాల అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.