22-03-2025 10:18:53 PM
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణలో టిఆర్ఎస్ లో అధికారం నుండి దించేందుకు పదేళ్లు పట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నంగిని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు పెంబల్లా జానయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవి అమలు పరచడంలో నేటికీ విఫలము అయిందని అన్నారు. ఏ గ్రామానికి వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు మహిళలు నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్, రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి, పగిళ్ల భిక్షం, నరేందర్ గౌడ్, పులకరం సైదులు, కర్నాటి లింగయ్య, అక్కినపల్లి సతీష్ ఉన్నారు.