calender_icon.png 11 April, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటెన్స్ డ్రామా ఆకట్టుకుంటుంది

03-04-2025 12:00:00 AM

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘శారీ’. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు గిరికృష్ణ కమల్ సైకలాజి కల్ థ్రిల్లర్ కథతో రూపొందించారు. రవిశంకర్‌వర్మ నిర్మి స్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యం లో మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితం లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలున్నాయనే పాయింట్ మీద చేసిన చిత్రమే ‘శారీ” అన్నారు.

హీరో సత్య యాదు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఒక ఇంటెన్స్ డ్రామాతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా చేయడం నాకొక వర్క్‌షాప్‌లా అనిపించింది’ అని హీరోయిన్ ఆరాధ్యదేవి తెలిపింది. డైరెక్టర్ కమల్ మాట్లాడుతూ.. ‘రెండు పాత్రలతోనే ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇది’ అన్నారు.