- సికింద్రాబాద్‌లో సెమినార్ నిర్వహణ
- హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): షెడ్యూలు ప్రాంతాలకు వర్తించే చట్టాలు పార్లమెంట్ చేసి రాష్ట్రాల్లో అమలులోకి రావాలిగానీ, రాష్ట్రాలకు షెడ్యూలు ప్రాంతాలకు వర్తించే చట్టాలను చేసే అధికారం లేదని ఆదివాసీ మేధావులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవో నంబర్ 3తో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగా లను షెడ్యూలు ప్రాంతంలో తెలుగు రాష్ట్రా లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22న తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును పరిశీలించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల షెడ్యూలు ప్రాంత ఆదివాసీ మేధావులు సికింద్రాబాద్‌లోని గురుస్వామి సెంటర్‌లో బుధవారం నిర్వహించిన మేధావుల మథనం సెమినార్‌కు హాజరయ్యారు.
షెడ్యూలు ప్రాంత ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో రాణించేందుకు 1948లో హైమన్‌డా ర్ఫ్ కమిటీ, 1966 కొఠారీ కమిషన్, 1985 నేషనల్ డెవలప్‌మెంట్ పాలసీ, 1992లో రివైజ్డ్ నేషనల్ డెవలప్‌మెంట్ పాలసీ రికమెండేషన్లను గమనించి పార్లమెంటులో చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, ప్రముఖ న్యాయవాది పల్లా త్రినాథరావు, భరత్‌భూషన్ అభిప్రా యం వ్యక్తంచేశారు. స్వతంత్ర భారత్‌లో గిరిజనులలో ఆచార వ్యవహారాల్లో గానీ, సంప్ర దాయాలలో గానీ ఎలాంటి మార్పులు రాలేదన్నారు. తెలంగాణలో పద్మశ్రీ ఆవార్డు గ్రహీతలు కనకరాజు, సకిన రామచంద్రయ్య ఆదివాసీలు కావడం వల్లనే వాళ్లకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో చదివిన ఆదివాసీ విద్యార్థుల్లో ఎంతమందికి ఉన్నత విద్య అందుతోందని ప్రశ్నించారు. తెగల పద్ధతులను గౌరవించే స్థానికులకే ఉపాధ్యాయులుగా నియమించాలని సూచించారు. ప్రభుత్వాలు చేసే చట్టా లు, ధరణి పోర్టల్ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించవని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్థానిక స్వపరిపాలనకు కేం ద్రం తెచ్చిన పెసా చట్టాన్ని తెలంగాణ ప్రభు త్వం అమలులో నిర్లక్ష్య చేస్తున్నదని, ఇది తెగ ల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నదని మేధావులు అభిప్రాయ వ్యక్తం చేశారు. సెమినార్‌కు అతిథులుగా ఖానాపూర్ ఎంఎల్‌ఏ వెడ్మ బొజ్జు, జేసీసీ చైర్మన్ తిరుపతి, ట్రైకార్ జీఎం శంకరరావు హాజరయ్యారు.