calender_icon.png 1 November, 2024 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటెల్‌లో 18వేల ఉద్యోగుల తొలగింపు!

03-08-2024 02:44:57 AM

  1. ఆర్థికమాంద్యం సంకేతాల నేపథ్యంలో అమెరికా దిగ్గజ కంపెనీ నిర్ణయం 
  2. ఖర్చులను తగ్గించే క్రమంలో లేఆఫ్స్ ఉంటాయని సంకేతాలు

వాషింగ్టన్ (అమెరికా), ఆగస్టు 2:  అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ సంస్థ ‘ఇంటెల్’ ఈ యేడాది దాదాపు 18వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు సమా చారం. ఈ సంఖ్య కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 15శాతం ఉంటుంది. కంపెనీ మార్జిన్లు తక్కువగా ఉన్నాయని.. ఖర్చులు ఎక్కువగా ఉంటు న్నాయని వీటిని నియంత్రించేందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సంస్థ సీఈఓ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు వలన ప్రతి యేడాది 20 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులు తగ్గించుకోవచ్చని యాజమాన్యం భావిస్తోంది. కాగా ఇటీవల ముగిసిన త్రైమాసికంలో ఇంటెల్ కంపెనీకి దాదాపు 1.6 మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.

ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో ఎన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఇలాంటి కఠిన నిర్ణ యం తీసుకోవాల్సి వస్తోందిని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇంటెల్ సంస్థలో 1,24, 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా పరిస్థితుల నేప థ్యంలో ఎవరిమీద వేటుపడుతుం దో అనే సందేహం అక్కడ పనిచేస్తున్న టెకీల్లో నెలకొని ఉంది.