19-04-2025 05:32:29 PM
కలెక్టర్ కు వినతిపత్రం అందించిన ఎస్ఎఫ్ఐ నేతలు..
చేవెళ్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను చేవెళ్ల మండల కేంద్రంలోనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ కోరారు. శనివారం మల్కాపూర్ సమీపంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్లో భూభారతి అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను చేవెళ్ల ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కలల గ్రామాల విద్యార్థులందరికీ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు సమీర్, చందు తదితరులు పాల్గొన్నారు.