calender_icon.png 12 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి పటిష్ట చర్యలునికి పటిష్ట చర్యలు

04-04-2025 11:36:50 PM

క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన

నాణ్యమైన ప్రమాణాలతో విద్యార్థులకు విద్యా బోధనకు అవకాశం

వైరా,(విజయక్రాంతి): వైరా పట్టణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంకు అనువైన స్థలాన్ని పరిశీలించిన శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు.విద్య ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ లక్ష్యం మేరకు, విద్యార్ధులకు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో మెదటి విడతలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయం నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా శుక్రవారం వైరా పట్టణంలో నూతనంగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు అనువైన స్ధలాలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా కే.వి.సి.ఎం కళాశాల, తరువాత తెలంగాణ గురుకుల పాఠశాలలను తిరిగి విశాలమైన భవనాలు, ఆట స్థలాలకు సరిపడ స్ధలం కోసం సాధ్యసాధ్యలను క్రేత్రస్ధాయిలో కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా వేలకు పైగా విద్యార్థులు విద్య అభ్యసిస్తారని దానికి అనుగుణంగా అనువైన స్ధలం ను సిద్దం చేయాలని అన్నారు. పాఠశాలలో చదువుకునే  విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడం ముఖ్యమని, ఇందులో భాగంగా మౌళిక వసతులు, ప్రభుత్వం ఆలోచనతో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు అద్భుతమైన మౌళిక వసతులతో సౌకర్యవంతమైన భవనాలు నిర్మిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని, క్రీడలు ఆడేందుకు వీలుగా విశాలమైన మైదానాలు, కోర్టులు ఏర్పాటు కు అనువైన స్ధలం ను ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని కలెక్టర్ అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, వైరా తహసీల్దార్ శ్రీనివాసరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమా, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.