calender_icon.png 17 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70 ఏళ్లు పైబడినవారికీ బీమా

12-09-2024 12:48:39 AM

ఆయుష్మాన్ భారత్‌లో ముఖ్య సవరణ

  1. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.10 వేల కోట్లు
  2. కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
  3. వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశంలో 70 ఏళ్లు, ఆ పైబడిన సీనియర్ సిటిజెన్లు అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణ యాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆదాయంతో సంబంధం లేకుండా బీమా పథకాన్ని అందించడం మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయమని, ఈ ఏడాది ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందే అవకాశం దక్కుతుందని వైష్ణవ్ స్పష్టం చేశారు. 

ఏదైనా ఎంచుకోవచ్చు..

బీమాలో ఆప్షన్లను ఎంచుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇతర బీమా పథకాల్లో చేరి ఉన్నవారు సైతం ఏదైనా ఎంచుకునేందుకు వెసులుబాటు కల్పిం చారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కుటుంబాల్లో సీనియర్ సిటిజెన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకంలో కొనసాగుతున్న సీని యర్ సిటిజెన్లకు అదనంగా ఏడాదికి రూ.25 లక్షల కవరేజీ  ఉంటుందని వైష్ణవ్ తెలిపారు. లబ్ధిదారులు ప్రస్తుతం తాము కొనసాగిస్తున్న వేరే ఇతర బీమా లేదా ఆయుష్మాన్ భారత్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి కార్డు అందిస్తారు. దీనితో దవాఖానలో చేరినప్పుడు రూ.5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. 

ఇతర నిర్ణయాలు

* ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధిం చి క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈవీ వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీ ఎం ఈ పథకానికి పచ్చజెండా ఊపారు. దీంతో దేశవ్యాప్తంగా 88,500 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకారం అందించనుంది. 

* 31 వేల మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రూ.12,460 కోట్లు కేటాయించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

* ప్రధానమంత్రి గ్రామ సడక్ యో జన నాల్గో ఫేజ్ అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 2024 వరకు రూ.70,125 కోట్లతో కనెక్టివిటీ లేని 25 వేల గ్రామాలకు 62 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, వంతెనల నిర్మాణం, పలు చోట్ల అప్‌గ్రేడేషన్ కోసం ఆర్థిక సాయం అందించనున్నారు.