calender_icon.png 1 April, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కృషి

29-03-2025 04:57:48 PM

కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉంటుంది

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ తెలిపారు. శనివారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎల్లారం ముత్తయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా, బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున రెండు లక్షల చెక్కును అందజేశారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా పార్టీ స‌భ్య‌త్వం క‌లిగిన బీఆర్ఎస్ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే రెండు లక్షల సహాయం అందిస్తూ అండగా ఉంటుందని  స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్  పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండటానికి  ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. కేసీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గార్లకు బాధిత కుటుంబా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.