27-03-2025 01:31:57 AM
మహబూబాబాద్. మార్చి 26: (విజయక్రాంతి) మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం సబ్ స్టేషన్ తండా మాజీ సర్పంచ్ గుగులోతు వెంకన్న గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసముద్రం బ్రాంచ్ నందు రెండు లక్షల ప్రమాద బీమా చేయడంతో ఆ పథకం ద్వారా మంజూరైన రూ.20 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును మృతుడు వెంకన్న భార్య కళ్యాణికి బుధవారం అందజేశారు.వెంకన్న కేసముద్రం ఎస్బిఐలో తన ఖాతా ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకంలో చేరినట్లు ఎస్బిఐ డిజిఎం గన్ శ్యామ్ సోలంకి, ఆర్ ఎం షేక్ అబ్దుల్ రహీం, స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్, జనరల్ ఇన్సూరెన్స్ క్లస్టర్ మేనేజర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ పథకంలో చేరి ప్రమాదంలో మరణించడం వల్ల వెంకన్న నామిని అయిన భార్య కల్యానికి బీమా సొమ్ము చెక్కును అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా ద్వారా ప్రమాద బీమా పథకంలో చేరడం వల్ల ఆపత్కాలంలో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని చెప్పారు.