21-03-2025 12:33:00 AM
అధికారులతో సమీక్షలో మంత్రి దామోదర
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్ప నకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశా రు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపే తా నికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్ర స్ట్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రభు త్వ ఆసుపత్రులలో సరిపడా పరికరాలు, మౌలిక వసతులు, డ్రగ్స్, శానిటేషన్, హెచ్‌ఆర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలు పేద ప్రజలకు అందుబాటు లో ఉండేలా అధికారులు ప్రత్యేక కసరత్తు చేయాలన్నారు. టూల్స్ అండ్ ప్లాంట్స్ నిర్వహణ కోసం అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు నిధుల కేటాయింపు చేయాల న్నారు.
అన్ని ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని తెలిపారు. వైద్యవిధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మారుసా ్తమ న్నారు. సమీక్షలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు.