మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కార్పొరేటర్ల వినతి
ఎల్బీనగర్, జూన్ 28 : ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, అండర్‌పాస్‌ల బదులు ఫ్లుఓవర్లను నిర్మించాలని బీజేపీ కార్పొరేటర్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పనామా గోదాం నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న అండర్‌పాస్ నిర్మాణాలతో వచ్చే ఇబ్బందులను మంత్రికి వివరించారు. అండర్‌పాస్ నిర్మాణాలను అడ్డుకోవాలని పిల్లర్లతో కూడి న ఫ్లుఓవర్లు నిర్మించాలని కోరారు. కార్పొరేట ర్లు వివరించిన సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సానుకూలంగా స్పందించా రు. సమస్యలను పరిశీలించాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారి ధర్మారెడ్డిని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో మన్సూరాబాద్, హయత్‌నగర్ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహరెడ్డి, నవజీవన్‌రెడ్డి ఉన్నారు.