06-04-2025 12:25:55 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 5 : ఒక సీసీ కెమెరా వుంది మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటు సామాజిక బాధ్యత అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సీపీ సుధీర్ బాబు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల పోలీస్ అధికారు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉన్న దేవాలయాలకు భద్రత కు సంబంధించి ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలోని 118 దేవాలయాల్లో 480 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. 14 కాలనీలు, 4 గ్రామాల్లో 380 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ప్రారంభించామన్నారు. సమాజం పట్ల బాధ్యతతోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి పౌరుడు పోలీసు అని, నేరాలు నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక కెమెరా 100మంది పోలీసులతో సమానమని, 24గంటలు పనిచేస్తున్న సీసీ కెమెరా లు సమాజానికి ఎంతో రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు.
860 కెమెరాలు ఏర్పాటు లో దేవాలయ భద్రత కూడా ముఖ్యమని, ఇందులో భాగంగా ఎల్బీనగర్ జోన్ 118 దేవాలయాలకు 480 కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 14కాలనీలకు, 4 గ్రామాల కలిసి 380 కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే రెండు నెలల్లో మరో 360 కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
- ఇద్దరు రౌడీషీటర్ల బహిష్కరణ
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు రౌడీషీటర్లను కమిషనరేట్ పరిధిలో బహిష్కరిస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. నల్లపోతుల రాజేశ్ (33)పై 19 కేసు లు, 4 హత్యా కేసులు ఉన్నాయని, సెక్షన్ 21 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేస్తున్నామని చెప్పారు.
సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహీన్ పై 21 కేసులు ఉన్నాయని, ఇతడిని కూడా నగర బహిష్కరణ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల ఎస్త్స్రలు, సిబ్బంది పాల్గొన్నారు.