28-04-2025 10:48:09 PM
మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్-కొత్తగూడెం ప్రధాన రహదారిపై బయ్యారం-ఇల్లందు మధ్య మూలమలుపుల వద్ద ప్రమాదం పొంచి ఉందంటూ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించిన బయ్యారం పోలీసులు ఆ మార్గంలో పలుచోట్ల వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మూలమలుపులు, ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి ఉందంటూ.. వేగం తగ్గించి వాహనాలను నడపాలని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బయ్యారం సిఐ రవికుమార్, ఎస్సై తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు.