calender_icon.png 6 March, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన

06-03-2025 02:41:52 PM

కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు   

నారాయణఖేడ్: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామి వారి మందిరంలో శ్రీభక్త మార్కండేయ ధ్వజ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రాంతంలో భక్త మార్కండేయ ఆలయం నిర్మించడం గొప్ప విశేషమని అన్నారు.

ఈ ఆలయం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా, భక్తి మార్గానికి మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు. ఖేడ్ ప్రాంతంపై, ప్రజలపై భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులు ఉండాలని అన్నారు. అనంతరం వారు స్వామివారికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలుచేసి భక్త మార్కండేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తదనంతరం ఎమ్మెల్యే  దంపతులను ఆలయ అర్చకులు మరియు పద్మశాలి సంఘం నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పద్మశాలి సంఘం నాయకులు మరియు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.