calender_icon.png 10 March, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొల్లూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివిగ్రహ ప్రతిష్టాపన

09-03-2025 08:11:24 PM

సమేత పాండురంగ విగ్రహ ప్రతిష్టలు...

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ గ్రామీణ మండలం కొల్లూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు.

అనంతరం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని గౌళిగూడలో నూతనంగా నిర్మించిన ఆలయంలో హనుమత్, శివ, రుక్మిణి విఠళేశ్వర, నంది, నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజ స్థంభ స్థాపన మహోత్సవం గత మూడు రోజుల నుండి పూజలు, యజ్ఞాలలో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరైన బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.