24-02-2025 05:02:42 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బురుగూడ గ్రామంలో స్వయంభుగ వెలిసిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం వేదపండితులు నిమ్మకంటి సంతోష్ శర్మ, మహేష శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు,హోమాలు చేసి నూతన శివలింగం, నంది విగ్రహాలను వేదమంత్ర ఉత్సవాలతో ప్రతిష్ఠాపన చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునీ, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.