calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు

18-03-2025 07:13:17 PM

కొల్చారం (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ రహదారి 765D పైన బ్లాక్ స్పాట్స్ ను గుర్తించిన ప్రదేశలలో రేడియంతో కుడిన రబ్బర్ బొల్లార్డ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మంగళవారం నాడు మండల కేంద్రమైన కొల్చారం లోతు వాగు మూలమలుపు ప్రాంతంలో రబ్బర్ బోల్డర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు. గతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలలో ఈ బొల్లార్డ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదల నివారణ చర్యలో భాగంగా ఈ బొల్లార్డ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రబ్బర్ బొల్లార్డ్స్ ను నర్సాపూర్ నుండి మెదక్ వరకు జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్సై మహమ్మద్ గౌస్ వెల్లడించారు.