calender_icon.png 8 February, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామెనలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన

07-02-2025 10:39:46 PM

చేవెళ్ల: చేవెళ్ల మండల పరిధి పామెన గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మైసమ్మ, దుర్గమ్మ, సరోజినమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో స్థానిక ప్రజలు, నేతలు హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, స్థానిక నేతలు కృష్ణమోహన్‌, మల్గారి వైభవరెడ్డి, కృష్ణగౌడ్‌, శ్రీరామ్‌నగర్‌ సర్పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కుమార్‌ గౌడ్‌, బర్ల కృష్ణ, పెద్దల కృష్ణ, శామ్‌ రెడ్డి, రాములు, నర్సింలు, నరేందర్‌ రెడ్డి, మల్లారెడ్డి, రమేష్‌, విజయ్‌ కుమార్‌, దవల్‌ గారి గోపాల్‌ రెడ్డి, సత్తయ్య రాజేందర్‌ రెడ్డి, మల్లారెడ్డి రవికుమార్‌ పాల్గొన్నారు.