11-04-2025 07:58:01 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శుక్రవారం రూ. 10 లక్షల నిధులతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూమ్ కాలనీలో 10 లక్షల నిధులు సమకూర్చినందుకు ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్, నాగిరెడ్డి, బసవరాజ్ దేశాయ్, కల్లూరి పండరి, అహ్మద్, డాక్టర్ సంజీవ్, నాగరాజు, ఆఫ్రౌజ్ విద్యుత్ శాఖ సిబ్బంది, వినోద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.