21-04-2025 10:25:37 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని హాజీపూర్ తండా సమీపంలో గల సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి నీటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక నిధులతో నూతన బోరు వేయించి మోటార్ పంపు బిగించినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సమాచారం అందించారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానికంగా ఉండే హాజీపూర్ తండా ప్రజలకు ఈ బోర్ బావి ఎంతో ఉపయోగకరంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరే జీవాధారం అని, ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందని నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.