బల్దియా ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31(విజయక్రాంతి): తమ డివిజన్లలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్, జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాజేష్ జైస్వాల్, మంగల్‌హాట్ కార్పొరేటర్ మీరంపల్లి శశికళకృష్ణ, బీజేపీ నాయకులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ ఎదుట మంగళవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఎన్నిసార్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినా సమస్య పరిష్కరిచండం లేదంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నితిన్ నందకార్, బీజేవైఎం నాయకులు అర్వింద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.