calender_icon.png 19 October, 2024 | 7:09 AM

ఇన్‌స్టా వేదికగా గంజాయి క్రయవిక్రయాలు

19-10-2024 12:00:00 AM

  1. చాటింగ్, లొకేషన్ షేరింగ్‌తో సమాచార మార్పిడి
  2. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్
  3. 1.18 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గంజాయికి సంబంధించి చాటింగ్, లొకేషన్స్ షేర్ చేయడంతో పాటు ప్రత్యేక వాహనాల్లో గంజాయిని తెప్పించి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రట్టు చేశారు. కూకట్‌పల్లి వసంతనగర్ కాలనీ రోడ్ నంబర్ గల ఓ ఇంట్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి 1.18కిలోల గంజాయి, కారు, బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖమ్మం జిల్లాకు చెందిన బేగం నిలేష్‌కుమార్, డోర్నకల్‌కు చెందిన సిరాజుల్లాగా గుర్తించారు. నిందితులు గంజాయి పెడ్లర్లతో పరిచయాలు పెట్టుకొని కొంత కాలంగా కొంతకాలంగా ఇన్‌స్టాగ్రాం వేదికగా..

గంజాయి క్రయ, విక్రయాలకు సంబంధించిన డీల్‌ను కుదుర్చుకొని.. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తెప్పించి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో ఎస్‌టీఎఫ్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ జ్యోతి, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు.. రాజేష్, వికాస్, జయచంద్ర, కాశీ తదితరులు పాల్గొన్నారు. కాగా నిందితులను పట్టుకున్న టీమ్‌ను ఎస్పీ భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు.