మంచిర్యాల, (విజయ క్రాంతి) : సైకాలజిస్ట్ గా సేవలనందిస్తున్న ప్రముఖ మంచిర్యాల టీపీఏ సైకాలజిస్ట్ బి. నారాయణ రావుని టీపీఏ రాష్ట్ర శాఖ "Inspiring Psychologist." అవార్డుతో సత్కరించారు. టీపీఏ 7వ వార్షికోత్సవం సందర్బంగా శనివారం రాత్రి హైదరాబాద్, బషీర్బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి హల్ లో జరిగిన కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, సినీ నటులు ప్రదీప్, ప్రముఖ సైకోయట్రిస్ట్ డాక్టర్ హరిణి, డాక్టర్. మోతుకూరి రాంచందర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. Insiring సైకాలజిస్ట్ అవార్డు గ్రహీత బి. నారాయణ రావుని, పలువురు ఉపాధ్యాయులు, కళాకారులు, సైకాలజీస్ట్స్, అధ్యక్ష కార్యదర్శులు పి. వెంకటేశ్వర్లు, డాక్టర్. శశి కిరణ్, లు అభినందించారు.