12-03-2025 01:48:15 AM
మాల మహా సంఘం రాష్ర్ట అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే
ఆదిలాబాద్, మార్చి 1౧ (విజయ క్రాంతి) : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ర్ట అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఫూలే గెస్ట్ హౌస్‌లో సావిత్రిబాయి పూలే మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులతో కలిసి ముందుగా ఫూలే దంపతులు చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ స్త్రీ సాధికారిక, సమసమాజ నిర్మాణం కోసం సావిత్రిబాయి పూలే 1848లో పూణే నగరంలో తొలి మహిళాల పాఠశాలను ప్రారంభించి స్త్రీ స్వేచ్ఛకు నాంది పలికిందన్నారు. పలువురు మహిళలు, సంఘం నేతలు పాల్గొన్నారు.
టీపీఏ ఆధ్వర్యంలో...
మంచిర్యాల, మార్చి 11 (విజయక్రాంతి): తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టిపిఏ) ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ లోని మహిళ సైకాలజిస్ట్‌లను శాలువాతో సన్మానించి, బహుమతులను అందజేశారు. టిపిఏ జిల్లా అధ్యక్షులు వేణు కుమార్, రాష్ర్ట ఉపాధ్యక్షులు నారాయణ రావు, జిల్లా ప్రదానకార్యదర్శి సుమన చైతన్య, అసోసియేషన్ సభ్యురాలు కవిత, ఉపాధ్యక్షులు మొగిలి, జాయింట్ సెక్రటరీ సృజన, సలహాదారు గుండేటి యోగీశ్వర్, సభ్యులు నాగరాజ్, దీప్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.