calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర చరిత్ర లేని ఊరు స్ఫూర్తితో..

17-04-2025 12:00:00 AM

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం ‘చౌర్యపాఠం’. ఈ సినిమాతో ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం అవుతున్నారు. చందు మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత త్రినాథ్‌రావు నక్కిన మాట్లాడుతూ.. ‘కారణాలేవైనా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గింది.

ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కొత్తవారితో సినిమా చేయడమనేది సాహసమే. ఆ సాహసం ఈ సినిమాతో చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతల అసలు కష్టాలు అర్థమయ్యాయి. నిర్మాతల మీద విపరీతమైన గౌరవం పెరిగింది. మౌత్ పబ్లిసిటీపై నమ్మకంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కార్తీక్ చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. తను చెప్పిన కాన్సెప్ట్ అసలు క్రైమ్ లేని ఊరు. ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు. నాకు చాలా ఆసక్తిగా అనిపించింది.

దాన్ని ఆధారంగా చేసుకుని ఒక కథ చేశాం. చౌర్యపాఠం అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు. ఒక అవసరం కోసం ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. అది చేస్తున్న ప్రాసెస్‌లో ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక టన్నెల్ తవ్వి దాని గుండా వెళ్లే క్రమంలో జరిగే కథ’ అన్నారు.  

హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ.. ‘త్రినాథ్ అనుకుంటే చాలా పెద్ద స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా చేయొచ్చు. ఆయన కొత్తవారికి ఛాన్స్ ఇద్దామని మమ్మల్ని తీసుకున్నారు. కొత్తవారికి ఛాన్స్ ఇస్తేనే కొత్త ప్రతిభ బయటకు వస్తుంది’ అని తెలిపాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ నేనే చేశా’ అని చెప్పింది. డైరెక్టర్ నిఖిల్ మాట్లాడుతూ.. ‘మా కష్టం మంచి ప్రతిఫలాన్నిస్తుందని నమ్ముతున్నా’ అని చెప్పారు.