calender_icon.png 14 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తి ప్రధాత వివేకానంద

13-01-2025 01:52:27 AM

కోరుట్ల, జనవరి 12 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, కీర్తిశేషులు కొడిపెల్లి రాజారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆదివారం అవిష్కరించారు. సామాజిక కార్యకర్త, తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ సంయోజక్ జిన్న సత్యనారాయణ రెడ్డి ప్రధాన వక్తగా హాజరై, వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద అని, దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన మహ నీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  కొడిపెల్లి గోపాల్’రెడ్డి, రాజేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, హిందూ యువసేన సభ్యులు, యూత్ సభ్యులు, గ్రామ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానంద

కరింనగర్, జనవరి22(విజయక్రాంతి): భారత దేశ ఔన్నత్యాన్ని  ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయులు స్వామీ వివేకానంద అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. . నగరంలోని శివ థియేటర్ చౌరస్తాలో స్థానిక కార్పోరేటర్ రాపర్తి విజయతో కలిసి స్వామీ వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నగరంలో వివిధ స్వచ్చంద సంస్ధ ల ద్వారా ప్రజలకు సేవలందించిన వారికి యువజన సేవా పురస్కాలను తన చేతుల మీదుగా అందజేశారు.  ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పోరేటర్ కచ్చు రవీంధర్, డివిజన్ వాసి రాపర్తి ప్రసాద్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో

  తంగళ్ళపల్లి, జనవరి 12: మండల కేంద్రంలోని వివేకనంద కాలనీలో మండల బిజెపి అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మండల బిజెపి పార్టీ కార్యాలయంలో నూతనంగా రెండోసారి తంగళ్లపల్లి మండల అధ్యక్షునిగా వెన్నమనేని శ్రీధర్ రావును పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది.

పార్టీ కార్యాలయంలో ఆయనకు శాలువాతో నాయకులు సన్మానించారు.ఈ సందర్భంగా వెన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడుతూ మండలంలో  పార్టీని  బలోపేతం చేసి వచ్చే స్థానిక ఎలక్షన్లో మెజార్టీ స్థాయి  సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసి  గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

ఈ అవకాశం కల్పించిన తంగళ్ళపల్లి మండల  ఇంచార్జ్  గూడూరు భాస్కర్,  కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కు, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు ఇటికల రాజు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు సిరివెరి ప్రశాంత్, మహిళా మండల అధ్యక్షురాలు కోడం భవిత, సోషల్ మీడియా కన్నే అరుణ తదితరులు పాల్గొన్నారు.