20-03-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్, మార్చి19 (విజయక్రాంతి): విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని క్రమశిక్షణతో అపూర్వ విజయాలు సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి అన్నారు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలో ‘ఫ్లోరెంట్‘ పేరుతో విర్వహించినటువంటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైవారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషిచేసి అన్ని రంగాలలో పై చేయి సాధించడమే కాకుండా ఘనవిజయాలు నమోదు చేసి సమాజంలో గర్వించదగ్గ విద్యార్థులుగా ఉండాలని సూచిస్తూ ప్రతి ఒక్కరూ వారికి నేర్పినటువంటి విషయాలను తప్పకుండా సాధన చేసి పట్టు సాధించినట్లయితే ఏ పోటీ పరీక్షల్లో అయిన విజయాన్ని సులభంగా సాధించడమే కాకుండా అత్యుత్తమ స్థానాల్లో స్థిరపడవచ్చని చెప్పారు.
డాక్టర్ వి. నరేందర్ రెడ్డి సారథ్యంలో విద్యార్థులు అన్ని రంగాల్లో పై చేయి సాధించడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలవడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.