17-03-2025 06:40:43 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ఎండ్రియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం 10వ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణులై, మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. పరీక్షల కాలంలో ఒత్తిడికి గురి కావద్దని విద్యార్థులకు సూచించారు.