calender_icon.png 28 November, 2024 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సేవించే వారి ఇళ్ళల్లో డాగ్ స్వాడ్ తో తనిఖీలు

08-10-2024 04:57:01 PM

బెల్లంపల్లి,  (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే వారి ఇళ్లలో మంగళవారం సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఐ అఫ్జలొద్దీన్ మాట్లాడుతూ చిన్న వయసులో చెడు అలవాట్లకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. యువత గంజాయికి అలవాటు పడి ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతున్నారన్నారు. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని పక్క రాష్ట్రాల నుండి గంజాయిని తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారన్నారు. గంజాయి సేవించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా గంజాయి అమ్మినా, సేవించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసులకు సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ తనిఖీలలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ కె.మహేందర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.