calender_icon.png 6 March, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కానింగ్ సెంటర్ల తనిఖీలు

06-03-2025 01:12:19 AM

జగిత్యాల అర్బన్, మార్చి 5 : రాష్ర్ట ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు  స్కానింగ్ సెంటర్లను   రాష్ర్ట పీసీపీ ఎన్ డిటీ  నోడల్ ఆఫీసర్ డాక్టర్ సూర్య శ్రీ బుధవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి లతో కలిసి స్కానింగ్ సెంటర్లను , ఇన్ విట్రో ఫర్టిలిటీ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్స్ లో నియమ నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ లో నమోదు చేయించుకున్న డాక్టర్స్ మాత్రమే సేవలు అందించాలని సూచించారు.రికార్డులను,స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. ఫారం ఎఫ్ నివేదికలు ఆన్లున్లో సబ్మిట్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 5వ తారీఖు లోపు వారికి కేటాయించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫారమ్ ఎఫ్ లు సబ్మిట్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె వెంట డేకాయ్ ఆపరేషన్ కమిటీ సభ్యులు గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి సుధా, సఖి కోఆర్డినేటర్ లావణ్య, అశ్విని,హెల్త్ ఎడ్యుకేటర్లు భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం, ఆరోగ్య పర్యవేక్షకులు  ఇండివర శ్యామ్ తదితరులున్నారు.