calender_icon.png 28 October, 2024 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లుల్లో తనిఖీలు

09-07-2024 12:52:23 AM

  • క్షేత్రస్థాయిలోకి మూడు బృందాలు

స్టాక్ వివరాలు, రికార్డుల నిర్వహణపై ఆరా

కామారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని అంతంపల్ల్లి, సదాశివనగర్, మాచారెడ్డిలోని రైస్ మిల్లులను సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్, సివిల్ సప్లు అధికారులు మూడు బృందాలుగా విడిపోయి తనిఖీ చేశారు. ప్రభుత్వం అలాట్ చేసిన మేర మిల్లుల్లో ధాన్యం ఉందా.. లేదా? స్టాక్ రికార్డుల నిర్వహణ ఎలా ఉంది.. అనే అంశాలపై బృందాలు ఆరా తీస్తున్నాయి. దాడుల్లో జిల్లాకు చెందిన సివిల్ సప్లు అధికారులే కాక మెదక్ జిల్లాకు చెందిన అధికారులూ ఉన్నారు.

రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రైస్‌మిల్లులను తనిఖీ చేయిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటు న్నారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారా ? లేదా సీరియస్‌గా సోదా చేస్తున్నారా? అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? అనేది త్వరలో తేలనున్నది. తనిఖీలు చేసిన వారిలో మెదక్ జిల్లా సివిల్ సప్లు అధికారి బ్రహ్మారావు, ఓఎస్ శ్రీధర్‌రెడ్డి, భిక్కనూరు తహసీల్దార్ శివప్రసాద్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కిష్టయ్య, భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ తదితరులు ఉన్నారు. దాడులపై కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందాన్ని వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైస్‌మిల్లుల్లో దాడులు నిర్వహిస్తున్నామని, సోదాల నివేదికలను ప్రభుత్వానికి నివేదిస్తామని సమాధానమిచ్చారు.