కామారెడ్డి, జూలై ౧౧ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గురువారం కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, రాజంపేట మండల కేంద్రాల్లోని రైస్‌మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలపై ఆరా తీశారు. తనిఖీల్లో స్టాక్ వివరాలు స్పష్టంగా నమోదు చేసిన పత్రాలు లేకపోవడంతో అధికారులకు లెక్కింపు తలకు మించిన భారంగా మారిం ది. నిజామాబాద్ డీఎస్‌వో, స్పెషల్ ఆఫీసర్ పద్మ, టాస్క్‌ఫోర్స్ టీమ్ ప్రతినిధి సుదర్శన్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, సివిల్ సప్లు అధికారులు అప్పా రావు, పాల్వంచ, దొమకొండ, భిక్కనూరు, రాజంపేట తహశీల్దార్లు, ఎస్సైలు పాల్గొన్నారు.