calender_icon.png 21 February, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాపిడ్ యాక్షన్ బృందాల ద్వారా తనిఖీలు

15-02-2025 01:00:27 AM

వనపర్తి, ఫిబ్రవరి 14 ( విజయక్రాంతి ) :  రాపిడ్ యాక్షన్ బృందాల ద్వారా కోళ్ల ఫారంల్లో తనిఖీలను చేపడుతున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన సిబ్బందితో కలిసి జిల్లా లో 47  సర్వే విలన్స్ అండ్ విజిలెన్స్,15 రాపిడ్ యాక్షన్ బృందాలను ఏర్పాట చేసి ప్రతిరోజు కోళ్ల ఫారం లలో తనిఖీలు చెపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్దారించడం తో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారులకు మందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయాన్నారు .వనపర్తి జిల్లాలో దాదాపుగా 300 కోళ్ల ఫారాలు,2.5 లక్షలు లేయర్ కోళ్లు, 24 లక్షల బ్రాయిలర్ కోళ్లు పోషిస్తున్నారన్నారు.