calender_icon.png 16 January, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో అధికారుల తనిఖీలు

11-07-2024 02:25:59 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ ‘వివాహ భోజనంభు’ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో కాలం చెల్లిన పదార్థాలు, సరిగా లేబుల్ లేని ప్యాకింగ్‌లతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్ పూసిన కొబ్బరి తురుమును అధికారులు కనుగొన్నారు. ఈ రెస్టారెంట్‌లో చిట్టి ముత్యాలు 25 కిలోల బియ్యం బస్తాకు 2022 నాటికే బెస్ట్ బిఫోర్ డేట్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులు, పాక్షిక్షంగా తయారు చేసిన ఆహారాలతో కవర్ చేయబడిన, సరిగా లేబుల్ చేయని వస్తువులను కనుగొన్నారు. డస్ట్‌బిన్లకు సరిగా మూతల్లేకపోవడం, వంట గది ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడం, వంట గది ఆవరణలో ఉన్న కాలువలో నిల్వ ఉన్న నీటిని గమనించారు. రెస్టారెంట్‌కు మెడికల్ ఫిట్‌నెస్ సర్టి ఫికెట్ కూడా లేదని గుర్తించారు.