calender_icon.png 26 October, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిస్సూర్‌లోని బంగారు షాపుల్లో జీఎస్టీ అధికారుల తనిఖీలు

26-10-2024 12:14:30 AM

సరైన రికార్డులు లేని 

బంగారు ఆభరణాల జప్తు 

త్రిస్సూర్ (కేరళ), అక్టోబర్ 25: కేరళలోని  త్రిస్సూర్ ప్రాంతంలో గల జ్యువెలరీ షాపుల్లో  జీఎస్టీ అధికారులు జరిపిన దాడుల్లో 108 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ దాదాపు 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. బంగారానికి సంబంధించి వ్యాపారుల వద్ద సరైన రికార్డుల్లేవని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. ‘టొర్రే డేల్ ఓరే (టవర్ ఆఫ్ గోల్డ్)’ అనే పేరుతో జీస్టీ అధికారులు 78చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మొదలైన ఈ తనిఖీలు గురువారం వరకూ కొనసాగాయి.జ్యువెలరీ వ్యాపారులు గత ఆరునెలలుగా జీఎస్టీ సరిగా కట్టకుండా ఫ్రాడ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యలో జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కేరళ రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్ అబ్రహాం పర్యవేక్షణలో ఈ దాడులు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయి.