calender_icon.png 21 October, 2024 | 8:40 PM

హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

21-10-2024 12:08:21 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధర్యంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌రెడ్డి, సాతి, శ్రీషిక బృందం సభ్యులు ఆదిలాబాద్ లోని హోటళ్లలో ఆదివారం తనిఖీలు చేశారు. లక్ష్మీ నరసింహసామి ఫ్యామిలీ రెస్టారెంట్‌లో నాణ్యత పాటించకపోవడంతోపాటు ఫుడ్‌గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో నిల ఉంచి న 30 కిలోల కుళ్లిన మాంసం గుర్తించారు.

హానికరమైన రంగులను కలి పిన చికెన్, చేపలు, ఎలాంటి లేబుల్ వివరాలు లేని పన్నీరు మసాలాలు, బూజు పట్టిన కూరగాయలను గుర్తించారు. హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. లోటస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో రిఫ్రిజిరేటర్‌లో దీర్ఘకాలంగా నిల ఉంచి న దుర్వాసన వస్తున్న మాంసపు ఉత్పత్తులు, 30 కిలోల గ్రేవీ, బూజు పట్టిన కూరగాయలను ధంసం చేశారు.

హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వినాయకచౌక్‌లోని ఢిల్లీ సీట్‌హౌస్, శ్రీ వెంకటేశర సీట్‌హౌస్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.