calender_icon.png 15 November, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేటలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

15-11-2024 12:06:15 AM

సూర్యాపేట, నవంబర్ 14: సూర్యాపేట పట్టణంలోని ఎల్‌ఎస్‌బేకరీ, కావేరి గ్రాండ్ హోటల్, తనూస్ లోగిలి, డాల్పిన్ బేకరీలో గురువారం ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన మాంసం, హానీకరమైన రంగులు కలిపిన చికెన్‌ను గుర్తించారు. కాలం చెల్లిన కలర్‌స్ప్రేలు, లేబుల్ డిక్లరేషన్ లేని కేక్, బ్రెడ్ ప్యాకెట్‌లను గుర్తించి ధ్వంసం చేశారు. యజమానులకు నోటీస్‌లు జారీ చేశారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, స్వాతి, శిర్షీక పాల్గొన్నారు.