calender_icon.png 12 January, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

12-10-2024 01:58:46 AM

కరీంనగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ హెడ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోరల్ జోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, స్వాతి, శీర్షిక సిబ్బందితో కలిసి కరీంనగర్ పట్టణంలోని పలు హోటళ్లను శుక్రవారం తనీఖీ చేశారు. మైత్రి హోటల్‌లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, ప్లాస్టిక్ కవర్లలో మాంసం ఉత్పత్తులను నిల్వ చేయడం, హానికరమైన రంగులను కలిపిన చికెన్ ఢ్రమ్‌స్టిక్స్, తుప్పు పట్టిన వంట పాత్రలు ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25 వేల విలువ గల 20 కేజీల మాంసం ఉత్పత్తులను ధ్వంసం చేసి, నోటీసులను జారీ చేశారు.