హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రాంతాల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా హిమాచల్ ప్రదేశ్ లో తయారుచేసి మేడ్చల్ లో అమ్ముతున్న 'ఫెరోజ్ ఎక్స్ టి' అనే మందిరం గుర్తించారు. బాకారం గాంధీ నగర్ లో నిర్వహించిన తనిఖీల్లో జ్వరం తగ్గుతుందని విక్రయిస్తున్న తులసి లీఫ్ చూర్ణం అనే ఆయుర్వేదిక్ మందులను, మల్కాజిగిరిలో నిర్వహించిన తనిఖీలు కిడ్నీలో రాళ్లు తగ్గుతుందని పేరిట విక్రయిస్తున్న యురిసిస్ కిట్ అనే ఆయుర్వేదిక్ మందులను గుర్తించారు. ఈ తనిఖీల్లో మేడ్చల్, గండి మైసమ్మ, ముషీరాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు బి.మౌనిక, ఎం హేమలత, రేణుక, తదితరులు పాల్గొన్నారు.