calender_icon.png 19 November, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు

19-11-2024 01:28:28 AM

నిబంధనలు పాటించని నాలుగు దవాఖానాల సీజ్ 

సిద్దిపేట, నవంబర్ 18 (విజయక్రాంతి): క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్-2010ని అనుసరించి ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ ఉండాలని సిద్దిపేట డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ రేవతి, డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. సోమవారం సిద్దిపేటలోని పలు ప్రైవేట్ ఆస్పత్రు లను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని నిరామయ, భజ రంగ్ పాలి క్లినిక్, మారుతి పాలి క్లినిక్, గురుసాయి కంటి హస్పిటల్‌ను వారు సీజ్ చేశారు.

ఆయా ఆస్పత్రులు మౌలిక వసతులను హెచ్‌ఐఎంఎస్ పోర్టల్‌లో పొందుపర చకపోవడం, ధరల పట్టిక ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ అనుమతులను రెన్యూ వల్ చేసుకోలేదని అధికారులు తెలిపారు. తరుచుగా ఆస్పత్రులపై నిఘా పెడతామన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.