22-04-2025 12:29:37 AM
మహబూబ్ నగర్, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి : జడ్చర్ల పట్టణం లోని తాజ్ ఫుడ్ కోర్టు ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మిల్క్ డైరీ యూనిట్స్ ను పుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ ల లో ,వినియోగించే చికెన్ బిర్యాని ల యొక్క నాణ్యత లను చెక్ చేయడం జరిగింది.అలాగే శుభ్రత ప్రమాణాలు చట్ట పరం గా ఉన్నాయా లేదా అని తనికి చేశారు ..
చికెన్ యొక్క నాణ్యత కోసం స్టేట్ ఫుడ్ లాబరేటరి కి పంపించడం జరిగిందన్నారు. డైరీ యూనిట్స్ ను కూడా పాల నాణ్యత కొరకు తనికి చేయడం జరిగింది..వీటిలో లాబ్ రిపోర్ట్ ఆధారం గా కల్తీ నిర్దారణ జరిగితే క్రిమినల్ చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.