calender_icon.png 23 March, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో తనిఖీలు

22-03-2025 01:25:30 AM

  • కాలం చెల్లిన నిత్యావసర సరుకులతోనే ఆహార పదార్థాలు తయారీ

కిచెన్‌లో అపరిశుభ్రవాతావరణం, డ్రైనేజీ నీటి దుర్గంధం

దాడుల వివరాలు వెల్లడించిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు

శేరిలింగంపల్లి, మార్చి 21(విజయక్రాంతి): హైదరాబాద్ కొండాపూర్‌లోని  కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కాలం చెల్లిన, నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులను భారీగా గుర్తించారు. 

వీటితోనే ఆహార పదార్థాలు తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతోపాటు, కాలం చెల్లిన పప్పు దినుసులు, పెరుగు, పాలును గుర్తించి, అక్కడికక్కడే వాటిని చెత్త డబ్బాల్లో వేయించారు.

అపరిశుభ్రంగా వున్నా కిచెన్‌తో పాటు డ్రైనేజీ వాటర్ అక్కడే పొంగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కనీసం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్‌ప్లే చేయలేదని అధికారులు తెలిపారు. హోటల్ లో పనిచేస్తున్న సిబ్బంది హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ధరించలేదని హోటల్ యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు.