calender_icon.png 6 February, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు

06-02-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్‌సంగువాన్

కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి), అంగన్వాడిలో టీచర్లు డుమ్మా అనే కథనం విజయ క్రాంతి దినపత్రిక లో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్  స్పందించారు. బుధవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ సిడిపిఓలు సూపర్‌వైజర్‌తో సమావేశాన్ని నిర్వహించారు.

సిడిపిఓ లు, సూపర్వైజర్లు క్షేత్ర పర్యటనలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీడీపీఓ లు, సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, పౌష్టి కాహారం, బాలామృతం, బియ్యం తదితర సరుకుల స్టాకు రిజిస్టర్‌లను పరిశీలిం చాలని, కేంద్రాలకు వచ్చే పిల్లల హాజరు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

కొత్తగా నిర్మించే అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలించాలని సూచించారు. శిధిలావస్థలో ఉన్న భవ నాల్లో కేంద్రాలను నడుపకూడదని తెలి పారు.

జిల్లాలో అంగన్వాడీ లకు స్వంత భవనాలు ఉండి విద్యుత్ సరఫరా లేని వాటికి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టా లని, అవసరమున్న కేంద్రాలకు విద్యుత్ సరఫరాకు మీటర్ లను సరఫరా చేయాలనీ విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్ ను ఆదేశించారు.

సూపర్‌వైజర్స్ పనితీరును, పర్యటనలను సిడీపీఓ లు పర్యవేక్షించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు పోషకా హారం సరఫరా లను తనిఖీ చేయాలని తెలిపారు. కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య ఎక్కువ గా నమోదు చేయడం , పిల్లల హాజరు తక్కువగా ఉండడం గమనించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

అంగన్వాడీ ల పనితీరును మెరుగుపరచి పిల్లలు, బాలింతలు, గర్భిణీలు సంఖ్య పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని ఏ.ప్రమీల, టాస్క్ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ లు దుర్గా ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేష్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సిడీపీఒలు, సూపర్‌వైజర్ష్  పాల్గొన్నారు.