15-04-2025 12:38:56 AM
ఖమ్మం, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ):-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాల మేరకు ఆదివారం కురిసిన అకాల వర్షానికి గురైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు పరిశీలించి, వెంటనే ధాన్యంను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నేత్రుత్వంలోని బృందం తల్లాడ మండలంలోని తల్లాడ, గొల్లగూడెం, కిష్టాపురం, మల్సూరు తండా, రంగంబంజర్, కల్లూరు లోని చిన్న కోరుకోండి, లక్ష్మీపురం పుల్లయ్య బంజర కొనుగోలు కేంద్రాలను సందర్శించి సెంటర్ ఇంచార్జి లతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వెంటనే మిల్లర్స్ తో మాట్లాడి సమ స్యలు పరిష్కరించడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.