నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అక్రమ గంజాయి రవాణా నియంత్రించేందుకు పోలీస్ శాఖ జాగిలాలతో వాహనాలను తనిఖీ నిర్వహించినట్టు వారు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.